పిఎంఇండియా
శాంతి బిల్లుకు పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం లభించినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. భారత్ సాంకేతిక విజ్ఞాన రంగ రూపురేఖలను మార్చివేసే సందర్భమిది అని ఆయన వ్యాఖ్యానించారు.
బిల్లును సమర్ధించినందుకు పార్లమెంటు సభ్యులకు ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఈ బిల్లు కృత్రిమ మేధకు సురక్షిత శక్తిని అందిస్తుందనీ, తయారీ రంగంలో హరిత ప్రధాన ప్రక్రియలను ఆచరించడానికి బాట వేస్తుందనీ, రాబోయే కాలంలో మన దేశంతో పాటు ప్రపంచంలో స్వచ్ఛ ఇంధనానికి పెద్ద పీట వేయడంలో మహత్తర పాత్రను పోషిస్తుందనీ ప్రధానమంత్రి అన్నారు.
ప్రయివేటు రంగానికీ, యువతకీ శాంతి బిల్లు అనేక అవకాశాల్ని అందిస్తుందని శ్రీ మోదీ తెలిపారు. భారత్లో పెట్టుబడి పెట్టడానికీ, నవకల్పనల మార్గంలో ముందుకు పోవడానికీ, నిర్మాణాలు చేపట్టడానికీ ఈ కాలం అత్యంత అనుకూల కాలమని కూడా ఆయన అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశంలో ఇలా పేర్కొన్నారు:
‘‘శాంతి బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలపడం మన సాంకేతిక విజ్ఞాన రంగ రూపురేఖలను మార్చివేసే సందర్భం. దీని ఆమోదానికి మద్దతిచ్చిన ఎంపీలందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ బిల్లు కృత్రిమ మేధకు సురక్షిత శక్తిని అందించడం మొదలు తయారీ రంగంలో హరిత ప్రధాన హరిత ప్రధాన ప్రక్రియల ఆచరణకు మార్గాన్ని సుగమం చేయడం వరకు.. భవిష్యత్తులో ఒక్క మన దేశమే కాకుండా, ప్రపంచం కూడా స్వచ్ఛ ఇంధనానికి ప్రాధాన్యాన్ని తప్పక ఇచ్చేటట్లుగా గొప్ప ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ప్రయివేటు రంగానికీ, మన యువతకూ అనేక అవకాశాల్ని కూడా ఈ బిల్లు అందిస్తుంది. భారత్లో పెట్టుబడి పెట్టేందుకూ, నవకల్పనల దిశగా ముందుకు పోయేందుకూ, భారత్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకూ ఇది అత్యంత అనుకూలమైన సమయం’’.
***
The passing of the SHANTI Bill by both Houses of Parliament marks a transformational moment for our technology landscape. My gratitude to MPs who have supported its passage. From safely powering AI to enabling green manufacturing, it delivers a decisive boost to a clean-energy…
— Narendra Modi (@narendramodi) December 18, 2025