Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

లక్నోలో ‘రాష్ట్ర ప్రేరణ స్థల్’ ప్రారంభోత్సవ విశేషాలను పంచుకున్న ప్రధానమంత్రి

లక్నోలో ‘రాష్ట్ర ప్రేరణ స్థల్’ ప్రారంభోత్సవ విశేషాలను పంచుకున్న ప్రధానమంత్రి


మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ జీవితంఆదర్శాలను గౌరవిస్తూ ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో నిర్మించిన రాష్ట్ర ప్రేరణ స్థల్‘ ప్రారంభోత్సవ విశేషాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారుఅటల్ బిహారీ వాజ్‌పేయీ 101వ జయంతి సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. నేడు లక్నో ఒక కొత్త స్ఫూర్తికి సాక్షిగా మారుతోందని వ్యాఖ్యానించారుఈ సందర్భంగా అందరికీ ఆయన క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారుడిసెంబర్ 25న దేశంలోని ఇద్దరు గొప్ప వ్యక్తుల జయంతి వేడుకలు ఉన్నాయనిభారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయీభారతరత్న మహామన మదన్‌ మోహన్‌ మాలవీయ దేశ గుర్తింపుఐక్యతప్రతిష్ఠను కాపాడటానికి జీవితాలను అంకితం చేశారని ప్రధాని మోదీ పేర్కొన్నారుఅపారమైన కృషి ద్వారా ఈ ఇద్దరు మహనీయులు దేశ నిర్మాణంలో చెరగని ముద్ర వేశారని ప్రధాని అన్నారు.

 

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో వరుస పోస్టులలో ఈ విధంగా పేర్కొన్నారు:

 

నిస్వార్థ నాయకత్వంసుపరిపాలన స్ఫూర్తిని రాష్ట్ర ప్రేరణ స్థల్‌లోని కమల పుష్ప ఆకారపు అత్యాధునిక మ్యూజియం సజీవంగా సాక్షాత్కరిస్తోందిఇది మన ప్రజా నాయకుల ఆదర్శాలను స్వీకరించి జీవితంలో అవలంబించేలా రాబోయే తరాలకు నిరంతరం ప్రేరణగా ఉంటుంది.”

 

దేశంలోని గొప్ప వ్యక్తుల ఆదర్శాలువిలువలుదేశసేవ స్ఫూర్తి అనేవి నేటికీ ప్రతి ఒక్కరికీ మార్గనిర్దేశం చేస్తున్నాయని చెప్పడానికి లక్నోలోని నా కుటుంబ సభ్యుల ఉత్సాహంఉల్లాసమే నిదర్శనం.”

 

భారతదేశానికి ఆత్మగౌరవంఐక్యతసేవా మార్గాన్ని చూపిన ఆలోచనకు చిహ్నంగా రాష్ట్ర ప్రేరణ స్థల్ ఉందిఇక్కడ ఉన్న డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీపండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయఅటల్ బిహారీ వాజ్‌పేయీ విగ్రహాలు.. మన ప్రతి అడుగుప్రతి ప్రయత్నం దేశ నిర్మాణానికి అంకితం కావాలనే సందేశాన్ని ఇస్తున్నాయి.”

 

భారతదేశంలో ఆర్థిక స్వావలంబనకు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ పునాది వేశారుఆయన ప్రేరణతో నేడు మనం దానిని మరింత బలోపేతం చేయడానికి ఏ అవకాశాన్ని విడిచిపెట్టటం లేదు.”

 

వరుసలో నిలబడిన చివరి వ్యక్తికి కూడా ప్రతి సౌకర్యం అందాలన్నది పండిట్ దీనదయాళ్ గారి దార్శనికతఈ రోజు మనం ప్రతి నిరుపేదకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలను అందిస్తున్నప్పుడు ఆయన కన్న అంత్యోదయ‘ కల సాకారం అవుతోంది.“

 

అటల్ బిహారీ వాజ్‌పేయీ జయంతి అనేది సుపరిపాలన ఉత్సవాలను జరుపుకునే రోజు కూడాభాజపాఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన సుపరిపాలన వారసత్వాన్ని నేడు మనం కొత్తగా విస్తరిస్తున్నాం.”

 

కాంగ్రెస్దాని మిత్రపక్షాలు రాజకీయంగా భాజపాను ఎప్పుడూ వివక్షతో చూశాయికానీ అందరినీ గౌరవించాలని భాజపా మాకు నేర్పిందిదీనికి ఒక్కటి కాదు చాలా ఉదాహరణలు ఉన్నాయి.”

 

దేశంలోని గొప్ప వ్యక్తుల జీవితంవారి ఆదర్శాలుఅమూల్యమైన వారసత్వానికి అంకితమైన ప్రేరణాత్మక స్మారక చిహ్నమే ఈ ‘రాష్ట్ర ప్రేరణ స్థల్’నేడు సుపరిపాలన దినోత్సవం సందర్భంగా లక్నోలో దీనిని ప్రారంభించడం అనేది నాకు అపారమైన గౌరవాన్నిచ్చింది.. ఆత్మ సంతృప్తిని అందించింది.”