Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సంథాలీ భాషలో భారత రాజ్యాంగం ఆవిష్కరణపై ప్రధానమంత్రి హర్షం


భారత రాజ్యాంగం సంథాలీ భాష ప్రతిని రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఆవిష్కరించడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. రాజ్యాంగంపై అవగాహనకు, ప్రజాస్వామ్యంలో  జన భాగస్వామ్యం ఇనుమడించేందుకు ఇది తోడ్పడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు “సంథాలీ సంస్కృతి, దేశ పురోగమనంలో ఆ తెగ ప్రజల పాత్రపై దేశం ఎంతో గర్విస్తోంది” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

“ఇదొక ప్రశంసనీయమైన ప్రయత్నం! సంథాలీ భాషలో రాజ్యాంగం ఆవిష్కృతం కావడం మన రాజ్యాంగంపై  అవగాహనను, ప్రజాస్వామ్యంలో జన భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు తోడ్పడుతుంది. సంథాలీ సంస్కృతి, దేశ ప్రగతిలో ఆ తెగ ప్రజల పాత్రపై దేశం ఎంతగానో గర్విస్తోంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.