Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వీరబాలల దినోత్సవం సందర్భంగా సాహస ‘సాహిబ్‌జాదా’ల త్యాగాన్ని సంస్మరించిన ప్రధానమంత్రి


వీరబాలల దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ సాహస ‘సాహిబ్‌జాదా’ల త్యాగాన్ని సంస్మరించుకున్నారు. ఇది ధైర్యం, దృఢ దీక్ష, సత్సంకల్పంతో ముడిపడిన రోజని ఆయన పేర్కొన్నారు.

ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

“సాహస ‘సాహిబ్‌జాదా’ల త్యాగ సంస్మరణకు గౌరవప్రద ప్రతీక ఈ వీరబాలల దినోత్సవం. మాతా గుజ్రీ జీ అచంచల విశ్వాసాన్ని, శ్రీ గురు గోవింద్ సింగ్ అమర ప్రబోధాన్ని ఈ రోజున మనం గుర్తు చేసుకుంటాం. ఇది ధైర్యం, దృఢ దీక్ష, సత్సంకల్పంతో ముడిపడిన రోజు. వారి జీవనం, ఆదర్శాలు తరతరాల దాకా ప్రజలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయి” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.