వీరత్వాన్ని నిర్వచించే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధాని
26 Dec, 2025
అసలుసిసలు వీరత్వమంటే ఏమిటో నిర్వచించే సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ప్రజలతో పంచుకున్నారు.
“బంధనం మరణం వాపి జయో వాపి పరాజయః।
ఉభయత్ర సమో వీరః వీరభావో హి వీరతా।।
ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“నిర్బంధంలోనైనా.. మృత్యుముఖంలోనైనా.. విజయమైనా.. పరాజయమైనా.. పరిస్థితి ఎటువంటిదైనప్పటికీ అచంచల, అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించే వాడే వీరుడు… అదే అసలుసిసలు వీరత్వం” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.