Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్ ట్రస్టీలతో సమావేశమైన ప్రధానమంత్రి


భారతదేశ వైవిధ్యభరితమైన సంస్కృతిని మరింత ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్ (ఐజీఎన్సీఏట్రస్టీలతో సమావేశమయ్యారు.

భారతదేశ సాంస్కృతిక ప్రచారంలో మరింతమంది ప్రజలను భాగస్వాములను చేసే మార్గాలపై ఐజీఎన్సీఏ ట్రస్టీలతో ప్రధానమంత్రి చర్చించారుఈ సందర్భంగాడిజిటల్క్షేత్రస్థాయి కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి మరింత చేరువవ్వడంపైనాభారతదేశ సుసంపన్నమైన  వారసత్వాన్ని పరిరక్షించడంలోనూప్రోత్సహించడంలోనూ కళాకారులుపండితులకు మద్దతు ఇవ్వడం పైనా వారు చర్చించారు.

నేడు ఐజీఎన్సీఏ  ట్రస్టీలను కలిసిమన దేశ వైవిధ్యభరితమైన సంస్కృతిని మరింతగా ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించాం.  ఈ ప్రయాణంలో మరింత మంది ప్రజలను భాగస్వాములను చేసే మార్గాలనుడిజిటల్క్షేత్రస్థాయి కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్లడంతో పాటు మన గొప్ప వారసత్వాన్ని పరిరక్షించడంలోనూప్రోత్సహించడంలోనూ కళాకారులుపండితులకు మద్దతు ఇవ్వడంపై కూడా మేం చర్చించాం” అని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‘ లో పేర్కొన్నారు.

 

***