Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జోర్డాన్ రాజుతో మాట్లాడిన ప్రధానమంత్రి ఈద్ శుభాకాంక్షలు తెలియజేసిన ప్రధాని పశ్చిమాసియాలో సంప్రదింపులు, దౌత్యం అవసరమని స్పష్టీకరణ


జోర్డాన్ రాజు అబ్దుల్లా IIతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు టెలిఫోన్లో సంభాషించారుపండగ శుభాకాంక్షలు తెలియజేశారుఈ ప్రాంతంలో మారుతున్న భద్రతా పరిస్థితుల గురించి చర్చించారు.

రాజు అబ్దుల్లా IIతో ప్రధానమంత్రి మాట్లాడారుఈద్ పర్వదినం నేపథ్యంలో శుభాకాంక్షలు తెలియజేశారుపశ్చిమాసియాలో కొనసాగుతున్న పరిస్థితులపై నాయకులిద్దరూ ఆందోళన వ్యక్తం చేశారువీలైనంత త్వరగా ఈ ప్రాంతంలో శాంతినిభద్రతనుస్థిరత్వాన్ని పునరుద్ధరించడానికి చర్చలుదౌత్యం అవసరమని స్పష్టం చేశారు.  

పశ్చిమాసియాలో ఇంధన మౌలిక వసతులపై జరుగుతున్న దాడి గర్హనీయమనిఇవి అనవసర ఉద్రిక్తతలకు దారి తీస్తాయని ప్రధానమంత్రి అన్నారునిరాటంకమైన వస్తుఇంధన రవాణాకు భారత్జోర్డాన్ మద్దతుగా నిలుస్తాయన్నారుఈ ప్రాంతంలో చిక్కుకుపోయిన భారతీయులు సురక్షితంగా తిరుగు ప్రయాణమయ్యేందుకు జోర్డాన్ చేస్తున్న ప్రయత్నాలను ప్రధాని ప్రశంసించారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌ ‌లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

‘‘ఈద్ పర్వదినం నేపథ్యంలో జోర్డాన్ రాజు అబ్దుల్లా IIకు శుభాకాంక్షలు తెలియజేశానుపశ్చిమాసియాలో కొనసాగుతున్న పరిస్థితులపై మా ఆందోళనను వ్యక్తం చేశాంఈ ప్రాంతంలో త్వరితగతిన శాంతిభద్రతస్థిరత్వం సాధించేందుకు చర్చలుదౌత్యం అవసరమని స్పష్టం చేశాంపశ్చిమాసియాలో ఇంధన మౌలిక వసతులపై జరుగుతున్న దాడులు గర్హనీయంఇవి అనవసర ఉద్రిక్తతలకు దారి తీయవచ్చునిరాటంకమైన వస్తుఇంధన రవాణాకు భారత్జోర్డాన్ మద్దతుగా నిలుస్తాయిఈ ప్రాంతంలో చిక్కుకుపోయిన భారతీయులు సురక్షితంగా తిరుగు ప్రయాణమయ్యేందుకు జోర్డాన్ చేస్తున్న ప్రయత్నాలను అభినందిస్తున్నాను.’’

 

***