Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

దేవి బ్రహ్మచారిణి దివ్య, దయానుగ్రహాలను చాటిచెప్పే సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధానమంత్రి


మాత బ్రహ్మచారిణి దివ్య, దయాగుణాన్ని చాటిచెప్పే సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:

‘‘బ్రహ్మచారిణి మాత చరణాలకు కోటి-కోటి నమస్సులు. దేవీ మాత భక్తులందరిపై దయ చూపాలని వేడుకుంటున్నాను.
దధానా కరపద్మాభ్యామక్షమాలాకమండలు
దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా’’
(ఈ శ్లోకానికి పద్మాలను పోలిన హస్తాలలో జపమాలను, జలంతో నిండిన కమండలాన్ని ధరించిన హే సర్వోన్నత దేవీ బ్రహ్మచారిణీ మాతా, నాపై కరుణ చూపవమ్మా అని భావం) అని పేర్కొన్నారు.  

 

***