Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సవాళ్లను అధిగమించటానికి ధైర్యం, సంకల్ప బలం ప్రాముఖ్యతను తెలియజేసే సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధానమంత్రి


జీవితంలో ఎదురయ్యే క్లిష్ట పరిస్థితులను అధిగమించటంలో ఆత్మ విశ్వాసంమనోస్థైర్యం ప్రాముఖ్యతను తెలియజేస్తూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఒక సంస్కృత సుభాషితాన్ని పంచుకున్నారు.

ధైర్యం, దృఢ సంకల్పం గల వ్యక్తికి జీవితంలో ఏదీ అసాధ్యం కాదని ప్రధానమంత్రి పేర్కొన్నారుసంకల్ప బలంఆత్మ విశ్వాసంతో ఎంతటి క్లిష్ట సవాళ్లనైనా అధిగమించవచ్చని శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

“ధైర్య సాహసాలు, సంకల్పం గల వ్యక్తికి జీవితంలో ఏదీ అసాధ్యం కాదుఆత్మ విశ్వాసంపట్టుదలతో అత్యంత కఠినమైన సవాళ్లను అధిగమించవచ్చు.

ఏకోపి సింహః సహస్రం యుథం మథనాతి దంతినమ్

తస్మాత్ సింహమివోదారమాత్మానం వీక్ష్య సమ్పతేత్”

వేల ఏనుగులను ఓడించే బలం ఒక సింహానికి ఉన్నట్లేమనిషి కూడా సింహం లాంటి ధైర్యంఆత్మ విశ్వాసంమనో స్థైర్యంతో ఎలాంటి భయం లేకుండా ఉత్తమమైన పనులను చేపట్టాలి.

 

***