పిఎంఇండియా
జలియన్‌వాలా బాగ్‌లో తమ ధైర్య సాహసాల్ని చాటి అమరులైన వారిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు స్మరించుకుంటూ, నివాళులు అర్పించారు. వారు చేసిన త్యాగం మన ప్రజల అజేయ స్ఫూర్తికి ఒక శక్తిమంతమైన ప్రమాణంగా నిలిచి ఉంటుందని శ్రీ మోదీ అన్నారు.
సమాజంలో విభజననీ, అన్యాయాన్నీ, అసంతృప్తినీ పెంచే విధ్వంసక శక్తులను బలంగా ఎదిరించాలనీ, దేశాన్ని సమృద్ధంగానూ, చైతన్యవంతంగానూ, స్వయంసమృద్ధంగానూ తీర్చిదిద్దే పరోపకారి శక్తుల్ని పోషించాలనీ కర్తవ్య పరాయణులైన సూచిస్తున్న ఓ సంస్కృత సుభాషితాన్ని కూడా ప్రధానమంత్రి ఈ సందర్భంగా ప్రజలతో పంచుకున్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ ఇలా పేర్కొన్నారు:
‘‘ఈ రోజు, మనం జలియన్‌వాలా బాగ్ సాహసిక అమరులకు శ్రద్ధాంజలి ఘటిద్దాం. వారి త్యాగం మన ప్రజల అజేయ స్ఫూర్తిని చాటే ఒక శక్తిమంతమైన ప్రమాణంగా నిలిచి ఉంటుంది. వారు చూపిన ధైర్య సాహసాలూ, వారి దృఢ సంకల్పమూ.. స్వేచ్ఛ, న్యాయం, ఆత్మగౌరవ విలువల్ని సదా పరిరక్షించడానికి రాబోయే తరాలకు స్ఫూర్తిని అందిస్తుంటాయి.’’
“ ਅੱਜ ਦੇ ਦਿਨ, ਅਸੀਂ ਜੱਲ੍ਹਿਆਂਵਾਲਾ ਬਾਗ਼ ਦੇ ਸੂਰਬੀਰ ਸ਼ਹੀਦਾਂ ਨੂੰ ਦਿਲੋਂ ਸ਼ਰਧਾਂਜਲੀ ਭੇਟ ਕਰਦੇ ਹਾਂ। ਉਨ੍ਹਾਂ ਦੀ ਕੁਰਬਾਨੀ ਸਾਡੇ ਲੋਕਾਂ ਦੇ ਕਦੇ ਨਾ ਝੁਕਣ ਵਾਲੇ ਜਜ਼ਬੇ ਦੀ ਮਜ਼ਬੂਤ ਯਾਦ ਦਿਵਾਉਂਦੀ ਹੈ। ਉਨ੍ਹਾਂ ਵੱਲੋਂ ਵਿਖਾਇਆ ਗਿਆ ਹੌਸਲਾ ਅਤੇ ਪੱਕਾ ਇਰਾਦਾ, ਆਉਣ ਵਾਲੀਆਂ ਪੀੜ੍ਹੀਆਂ ਨੂੰ ਆਜ਼ਾਦੀ, ਇਨਸਾਫ਼ ਅਤੇ ਮਾਣ-ਸਨਮਾਨ ਦੀਆਂ ਕਦਰਾਂ-ਕੀਮਤਾਂ ਉੱਤੇ ਪਹਿਰਾ ਦੇਣ ਲਈ ਲਗਾਤਾਰ ਪ੍ਰੇਰਿਤ ਕਰਦਾ ਆ ਰਿਹਾ ਹੈ।”
‘‘జలియన్‌వాలా బాగ్ నరసంహారంలో ప్రాణ త్యాగం చేసిన వారికి నేను శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. విదేశీ పాలనలో దౌర్జన్యానికి వ్యతిరేకంగా వారు ప్రదర్శించిన అజేయ సాహస, స్వాభిమాన గాథలు దేశంలో ప్రతి ఒక్క తరానికీ ప్రేరణను అందిస్తుంటాయి.’’
‘‘ఇంద్ర వర్ధన్తో అప్తుర: కృణవన్తో విశ్వమార్యమ్
అపఘ్నన్తో అరావ్ణ:’’
‘‘ఓ కర్తవ్యపరాయణులైన ప్రజలారా, సమాజంలో పరోపకారబుద్ధి కలిగిన శక్తుల్ని పోషించండి. ఆ శక్తులు దేశాన్ని సమృద్ధంగా, చైతన్యవంతంగా, స్వయం సమృద్ధంగా తీర్చిదిద్దుతాయి. అదే సమయంలో, సమాజంలో విభజననీ, అన్యాయాన్నీ, అసంతృప్తినీ పెంచే విధ్వంసక శక్తుల్ని బలంగా ఎదుర్కోండి.’’
***
On this day, we pay our heartfelt homage to the brave martyrs of Jallianwala Bagh. Their sacrifice stands as a powerful reminder of the indomitable spirit of our people. The courage and determination they displayed continue to inspire generations to uphold the values of liberty,…
— Narendra Modi (@narendramodi) April 13, 2026
ਅੱਜ ਦੇ ਦਿਨ, ਅਸੀਂ ਜੱਲ੍ਹਿਆਂਵਾਲਾ ਬਾਗ਼ ਦੇ ਸੂਰਬੀਰ ਸ਼ਹੀਦਾਂ ਨੂੰ ਦਿਲੋਂ ਸ਼ਰਧਾਂਜਲੀ ਭੇਟ ਕਰਦੇ ਹਾਂ। ਉਨ੍ਹਾਂ ਦੀ ਕੁਰਬਾਨੀ ਸਾਡੇ ਲੋਕਾਂ ਦੇ ਕਦੇ ਨਾ ਝੁਕਣ ਵਾਲੇ ਜਜ਼ਬੇ ਦੀ ਮਜ਼ਬੂਤ ਯਾਦ ਦਿਵਾਉਂਦੀ ਹੈ। ਉਨ੍ਹਾਂ ਵੱਲੋਂ ਵਿਖਾਇਆ ਗਿਆ ਹੌਸਲਾ ਅਤੇ ਪੱਕਾ ਇਰਾਦਾ, ਆਉਣ ਵਾਲੀਆਂ ਪੀੜ੍ਹੀਆਂ ਨੂੰ ਆਜ਼ਾਦੀ, ਇਨਸਾਫ਼ ਅਤੇ ਮਾਣ-ਸਨਮਾਨ ਦੀਆਂ…
— Narendra Modi (@narendramodi) April 13, 2026
जलियांवाला बाग नरसंहार के सभी अमर बलिदानियों को मेरी आदरपूर्ण श्रद्धांजलि। विदेशी हुकूमत की बर्बरता के खिलाफ उनके अदम्य साहस और स्वाभिमान की गाथा देश की हर पीढ़ी को प्रेरित करती रहेगी।
— Narendra Modi (@narendramodi) April 13, 2026
इन्द्रं वर्धन्तो अप्तुरः कृण्वन्तो विश्वमार्यम्।
अपघ्नन्तो अराव्णः॥ pic.twitter.com/Pl6zlmM88L